ఈ నెల 28 న జరగనున్న మాజీ ప్రధాని పివి నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి, పివి శత జయంతి ఉత్సవాల కమీటీ సభ్యులు కె.తారక రామారావు పిలుపునిచ్చారు. ఈరోజు 51 దేశాల్లోని ఏన్ అర్ ఐలతో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచే తెలంగాణ అస్ధిత్వానికి అండగా నిలిచిన మహనీయుల సేవలను స్మరించుకోవడంలో ముందు వరుసలో ఉన్నదన్నారు. ఈ మేరకు పివి నర్సింహారావు, ఈశ్వరీభాయి, వెంకటస్వామి లాంటి వారిని పార్టీలకతీంగా ముఖ్యమంత్రి వారి సేవలను స్మరించుకుంటూ వారి జయంతులను అధికారికంగా జరిపేలా అదేశాలిచ్చారన్నారు. దీంతోపాటు జయశంకర్ సార్ తో పాటు, పివి నర్సింహారావు, కోమురం భీం వంటి మహనీయుల పేర్లను యూనివర్సీటీలు, జిల్లాలకు పేర్లు పెట్టి స్మరించుకుంటున్నామన్నారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ఖాండాంతారాలకు తెలిసేలా చేసిన మహనీయుడు పివి గారి రావాల్సిన పేరు రాలేదని, భారతరత్న దక్కాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ఈమేరకు పివికి భారత రత్న దక్కాలని ప్రధానికి స్వయంగా కలిసి విజ్ఝప్తి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని మంత్రి ఈ సదర్భంగా ప్రస్తావించారు. స్వతంత్య సమరయోధుడిగా, రాజకీయ నాయకునికిగా, ప్రధానిగా అధ్బుతమైన సేవలందిచిన మహనీయుడి జయంతిని రానున్న సంవత్సరం పాటు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏన్నారైలు అందరు శతజయంత్యుత్సవాల్లో పాల్గోనాలని కెటియార్ పిలుపునిచ్చారు. ముందుగా ఎల్లుండి జరిగే జయంతి ఉత్సవాల్లో అన్ని దేశాల్లోని తెలుగువారందరికీ కలుపుకొని ఆయన జయంతిని జరుపుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకోసం తెలంగాణ సంఘాలతో పాటు మిగిలిన తెలుగు సంఘాలతో సమన్వయం చేసుకొని ఈ ఉత్సవాలను నిర్వహించాలన్నారు. రానున్న సంవత్సరం పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి సమన్వయం చేసుకొనేందుకు ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాలను శతజయంతి ఉత్సవాల కమిటీలో సభ్యునిగా చేర్చుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈనెల 28న జరగనున్న పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన సమాధి జ్ఞానభూమి వద్ద జరుగుతున్న ఏర్పాట్లకు పరిశీలించేందుకు మంత్రి కే. తారకరామారావు ఈరోజు నెక్లెస్ రోడ్ లోని జ్ఞానభూమి సందర్శించారు. హైదరాబాద్ నగర మేయర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిలతో కలిసి జ్ఞానభూమినని సందర్శించిన మంత్రి కేటీఆర్, పివి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి ఎలాంటి లోటు రాకుండా ఉత్సవాలు ఘనంగా జరిగేలా చూడాలన్నారు.