తెలంగాణలోని అన్ని పట్టణ మున్సిపాలిటీలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. బీఆర్‌కే భవన్‌లో అగ్నిప్రమాదం ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీల్లో మంత్రులు మహమూద్ అలీ తలసాని సీఎస్ శాంతికుమారి డీజీపీ అంజనీకుమార్ అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పలు ఆంశాలపై చర్చించారు. ఫైర్ సేఫ్టీ లేని భవనాల గుర్తింపు వాటిపై తీసుకోవాల్సిన చర్యలు పాత భవనాలు అక్రమ నిర్మాణాల కూల్చివేత సెల్లార్లపై అక్రమ వ్యాపారాలు నివారాణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా డెక్కన్ స్పోర్ట్స్ మాల్‌లో గల్లంతైన మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మూడు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.
అక్రమ భవనాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ సూచించనున్నది. అలాగే అగ్నిమాపకశాఖకు భారీగా నిధులు కేటాయించాలని, ఈ బడ్జెట్‌లోనే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అగ్నిపకశాఖ ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణలు చేయాలి నిర్ణయానికి వచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణలో ప్రభుత్వం చేపట్టే చర్యలో భవన యజమానులను భాగస్వాములను చేయాలని సూచించారు. అవసరమైతే ప్రస్తుత ఫైర్ సేఫ్టీ చట్టాలను మార్చాలన్నారు. ఫైర్ సేఫ్టీ విషయంలో సాంకేతికతను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలని, విదేశాల్లో ఫైర్ సేఫ్టీపై అధ్యయనం చేయాలన్నారు. అవసరమైన ఆధునిక సామగ్రి అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అత్యవసర సామగ్రికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి…