- Advertisement -
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీద నుంచి కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకువెళ్లిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండగా తాజాగా స్పందించారు మంత్రి కేటీఆర్.
ఖేరి రైతులను అత్యంత దారుణంగా హత్య చేశారని… అన్నదాతలను చంపిన తీరు భయానకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది అనాగరికమైన చర్య అని… రైతు హత్యలకు పాల్పడిన వారిని త్వరలోనే శిక్షిస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.
నిరసనలు చేస్తే రైతులకు బుద్ధి చెబుతం అని రైతులు చనిపోయే కొద్ది గంటల ముందు లఖింపురి ఖేరిలో కేంద్ర మంత్రి రైతులను ఉద్దేశించి హెచ్చరించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను మంత్రి రీట్వీట్ చేశారు.
- Advertisement -