ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నలను సంధించారు. సుదీర్ఘ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న బయ్యారం స్టీల్ ప్లాంట్ పై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏపీ విభజన చట్టంలో హామీ ఇచ్చినా.. ఆ ప్లాంట్ ఏర్పాటు కలగానే మిగిలిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఆ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరారు.
Also Read:బెండకాయ సర్వ రోగనివారిణి అని తెలుసా..!
గత తొమ్మిదేళ్లుగా తాము బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని, ఎన్నో పర్యాయాలు కేంద్రాన్ని కోరామని, కానీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ వరుసగా అభ్యర్థనలను తిరస్కరిస్తూ తమను నిరుత్సాహానికి గురి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.
PM @NarendraModi Ji,
The long-standing dream of the people of Telangana for an integrated steel plant at Bayyaram remains unfulfilled, despite being promised in the AP Reorg Act.
Even after 9 years, and several reminders, the BJP-led Union Government's continued denial is… pic.twitter.com/Jo3fwbJtON
— KTR (@KTRBRS) July 8, 2023