నీతి ఆయోగ్ సిఫార్సులను గౌరవించండి: కేటీఆర్

113
ktr
- Advertisement -

ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మానస పుత్రిక అయిన మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రతీ ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలిపెట్టకుండా రక్షిత తాగు నీరు సరఫరా అవుతుంది. శుద్ధి చేసిన తాగు నీటిని ఇంటింటికీ నల్లా ద్వారా అందజేస్తూ “మిషన్ భగీరథ” దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలో ‘రెగ్యులారిటీ కేటగిరీ’ లో కేంద్రం తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా గుర్తించి జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపిక చేసింది.

మిష‌న్ భ‌గీర‌థ‌కు జాతీయ అవార్డు రావ‌డంపై మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాల‌కు సుర‌క్షిత తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్నందుకు గాను ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రాన్ని గుర్తించిన కేంద్రానికి మంత్రి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రూ. 19 వేల కోట్లు ఇవ్వాల‌న్న నీతి ఆయోగ్ సిఫార్సుల‌ను కేంద్రం గౌర‌వించాల‌ని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

- Advertisement -