చీప్ లిక్కర్..ఇదే బీజేపీ విధానామా:కేటీఆర్

28
ktr

బీజేపీ నేతలపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 50కే చీప్ లిక్కర్ అందిస్తామని సోము వీర్రాజు ప్రకటించడంపై సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుండగా కేటీఆర్ సైతం స్పందించారు. ఏపీ బీజేపీ నేతలు మరింత దిగజారిపోయారని…వావ్ వాట్ ఏ స్కీమ్‌ వాట్ ఏ షేమ్ అంటూ పేర్కొన్నారు. రూ. 50కే చీప్ లిక్కర్ ఇదే బీజేపీ జాతీయ విధానామా అని ప్రశ్నించారు.అధికారంలో లేని రాష్ట్రాలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారా అని ఎద్దేవా చేశారు.