మరొక అవకాశం ఇవ్వండి.. బంగారు తెలంగాణ చేస్తాం

221
ktr
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు పచ్చబడిందని, పచ్చని పాలమూరును చూస్తే కన్నుల పండుగగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్థన్‌ రెడ్డి తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, ఏ నియోజకవర్గంలో చూసినా దారులన్ని గులాబీమయమవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ktr elections

పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే పాలమూరు జిల్లాలో వలసలు వాపసు వస్తాయని, ఇవాళ పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ నేతల కళ్లు పచ్చబడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాలమూరు పచ్చబడుతుంటే ఓర్వలేని కాంగ్రెస్‌ ప్రాజెక్టులను అడ్డుకుంటుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి చేశామని, అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని మంత్రి కేటీఆర్‌ ద్వజమెత్తారు. దేవరకద్ర, కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ నేతలు పాలమూరు ప్రాజెక్టు ఆపాలని కోర్టుకు వెళ్లిన్రు. శ్రీశైలం నుంచి హంద్రినీవా, పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకెళ్తుంటే కాంగ్రెస్ నేతలు అప్పుడు ఏం చేశారని అడిగారు. నాగం జనార్ధన్‌రెడ్డి కూడా ఆగమై కోర్టుకు వెళ్లిండు. పాలమూరు పచ్చబడితే ప్రజలు పట్టించుకోరని కోర్టులకు వెళ్లి ప్రాజెక్టును ఆపుతున్నరు. చనిపోయినవారి వేలిముద్రలతో కోర్టుకు వెళ్లిన దౌర్భాగ్యపు నేతలు ఉన్నారని మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

minister ktr

సంక్షేమంలో తెలంగాణను తెలంగాణలో నిలిపిన కేసీఆర్‌ను గద్దె దించాలా? వృద్ధులకు, వికలాంగులకు ఆసరాగా నిలబడ్డందుకు కేసీఆర్‌ను గద్దె దించాలా? ఎకరానికి ఎనిమిది వేల పెట్టుబడి ఇస్తున్నందుకు దించేయాలా?. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చినందుకు దించేయాలా అని ప్రశ్నించారు. అమలు కానీ హామిలతో గద్దెనెక్కేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుయుక్తులు పన్నుతుందని, కాంగ్రెస్‌ మోసాలను ప్రజలను గమనించాలని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు సూచించారు. మరొక సారి టీఆర్‌ఎస్‌ పార్టీని ఆశీర్వదించాలని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -