బిగ్‌ బాస్‌ నుంచి దీప్తి ఎలిమినేట్‌‌?

90
Deepti-Nallamothu-in-‘Bigg-Boss-Telugu-

బిగ్‌ బాస్‌ షో.. తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత ప్రజాధరణతో విజయవంతంగా ప్రసారమవుతున్న షో. నాని హోస్ట్‌గా బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ప్రారంభమైనప్పటి నుంచి పలు వివాదాలు, విమర్శలు, ఎలిమినేషన్స్‌, గొడవలు, ఏడుపులతో ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ షో బుల్లితెర చరిత్రలో అత్యంత రేటింగ్‌తో విజయవంతంగా ప్రసారమైంది. అయితే మరికొన్ని రోజుల్లో బిగ్‌బాస్‌ 2 సీజన్‌ ముగియనుంది. ఇప్పటికే ఎండింగ్‌ ఎపిసోడ్‌కు చేరుకున్న ఈ షో మరికొన్ని రోజుల్లోనే ముగియనుంది. అయితే ఇప్పుడు ఈ షోకు సంబంధించి ప్రేక్షకుల్లో మెదిలే ప్రశ్న ఒక్కటే. బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేత ఎవరు అనేదే ఇప్పుడు ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ప్రశ్న.

Deepti-Nallamothu-in-‘Bigg-Boss-Telugu-

బిగ్‌ బాస్‌ 2 సీజన్‌ లో గెలుపు ముంగిట 5 కంటెస్టెంట్స్‌ ఉన్నారు. వీరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో అన్నదే ఇప్పుడు సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ షోలో సాధారణంగా ఎలిమినేషన్స్‌ శనివారం లేదా ఆదివారం జరగనుండగా తాజాగా ఇవాళ జరిగే ఎపిసోడ్‌లో ఎలిమినేషన్స్‌ ఉంటాయనే వార్త ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇవాళ జరిగే ఎపిసోడ్‌లో ఎవరో ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్‌ కానున్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Deepti-Nallamothu

అయితే ఆ ఎలిమినేషన్‌ అయ్యే కంటెస్టెంట్‌ టీవీ 9 యాంకర్‌ దీప్తి అనే ప్రచారం జరుగుతోంది. దీప్తి ఎలిమినేషన్‌ కు కారణం ఫేక్‌ ఓటింగే అని తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి బిగ్‌ బాస్‌ 2 సీజన్‌ ముగింపు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రేక్షకుల్లో మాత్రం ఉత్కంఠ మరింత పెరుగుతోంది. చూడాలి మరి బిగ్‌ బాస్‌ 2 సీజన్‌ విన్నర్‌ ఎవరు అవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.