కార్యకర్త కుటుంబానికి అండగా మంత్రి కేటీఆర్..

260
ktr
- Advertisement -

గత ఏడాది అక్టోబర్ 2020లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన భీమేశ్వరరావును మావోయిస్టులు హతమార్చిన విషయం విదితమే. నాడు తెలంగాణ ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఈమేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి మంత్రి కేటీఆర్ చేతుల మీదగా గురువారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ తరుపున రూ.5 లక్షలు, ప్రభుత్వం తరపున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను భీమేశ్వరరావు సతీమణి కుమారికి అందజేశారు. దీనితో పాటు కుమారుడు సాయి కుమార్‌కు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

భీమేశ్వరరావు చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గా, ఆలుబాక టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడుగా పనిచేశారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు సాయి కుమార్ కు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నిర్మాణ కోసం, పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, అందుకే సభ్యత్వం ఉన్న కార్యకర్త మరణిస్తే వారికి రూ.2 లక్షల భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తరుపున మరియు టీఆర్ఎస్ పార్టీ తరుపున కార్యకర్త కుటుంబానికి బాసటగా నిలిచిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వారి కుటుంబాన్ని ఆదుకుని రూ.30 లక్షలు, ఉద్యోగ భద్రత కలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -