ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ను, వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కమిషన్ చైర్మన్ డా ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో సభ్యుల బృందం అసెంబ్లి లో కలిసి కమిషన్ డైరీ, సావనీర్, క్యాలెండర్, లను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బాగా పని చేస్తుంది..రాష్ట్ర వ్యాప్తంగా తాండల్లో,పల్లెల్లో,గ్రామాల్లో పర్యటించి ఒకవైపు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరిస్తూనే ..మరో వైపు ఆయా వర్గాలతో నిత్యం సంబంధాలను కొనసాగిస్తూ వారికి కమిషన్ అండగా ఉంటుందనే నమ్మకం కలిగించారని చెప్పారు.
కమిషన్ పనితీరు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.జిల్లాల్లో ప్రతి నెల నిర్వహించే డీవీఎంసీ (DVMC) సమావేశాలు కమిషన్ చరిత్రలోనే సరికొత్త పంథా కి నాంది పలికిందని ప్రశంసించారు. చైర్మన్ నేతృత్వంలోని కమిషన్ సభ్యులు, సంబంధిత అధికారులు అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చూపుతున్న చొరవ ఆయా వర్గాల పేదల మన్నలను దక్కించుకున్నారని అభినందించారు.
అదే విధంగా 6,000 కేసులలో బాధితులకు 42 కోట్ల రూపాయల పరిహారం ప్రభుత్వ ద్వారా ఇప్పించడం అభినందనీయం. కమిషన్ కు సంబంధించి డైరీ,సావనీర్ ,క్యాలెండర్ లాంటివి ప్రవేశపెట్టడం కమిషన్ యొక్క గొప్పతనం,పనితీరుకు ఆర్ధం పడుతుంది..త్వరలోనే నా శాఖలో కూడా రివ్యూ సమావేశం నిర్వహించాలి..ఆ రోజు నేను కూడా హాజరవుతాను అని కేటిఆర్ చెప్పారు. ఇదే విధంగా కమిషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎస్సీ,ఎస్టీ వర్గాల అభ్యున్నతికై పని చేస్తూ మంచి ప్రగతిని సాధించాలని అన్నారు..ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,సభ్యులను ప్రశంసించారు . కేటిఆర్ ను కలిసిన వారిలో సభ్యులు విద్యాసాగర్, రంబాల్ నాయక్, నీలదేవిలు పాల్గొన్నారు.