బీజేపీ నేత లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్..

41
laxman

తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా తాజాగా బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కోవా లక్ష్మణ్‌ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్‌ పరీక్ష చేయించుకొని ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు.