తమిళిసై మాతృమూర్తి మృతిపట్ల కేటీఆర్ సంతాపం

101
ktr

రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్‌ మాతృమూర్తి దివంగత కృష్ణ కుమారి భౌతిక కాయానికి నివాళులర్పించారు మంత్రి కేటీఆర్. గవర్నర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కెపి వివేకానంద, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్ కుమార్ ఉన్నారు.

కృష్ణకుమారి మరణంపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హరీశ్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి తయాకర్‌ రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.