ప్రకాశ్‌ రాజ్‌…ఈజ్ బ్యాక్

114
prakash raj

గాయం కారణంగా కొంతకాలంగా షూటింగ్‌కు దూరమైన సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌ కోలుకున్నారు. దీంతో తిరిగి సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఈ ఫోటో గ్వాలియర్ విమానాశ్రయంలో దిగగా ప్రకాశ్ రాజ్‌తో పాటు దర్శకుడు మణిరత్నం, నటులు కార్తీ ఉన్నారు.

ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన క్లాసిక్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అభిమానులు ఈ సినిమా రెగ్యులర్ అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ప్రభు, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, కిషోర్, జయరామ్ వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2022 లో విడుదల కానుంది. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.