ఐపీఎల్ 14వ సీజన్ త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సీజన్‌లో ఏఏ నగరాల్లో మ్యచ్‌లు జరిగేది కూడా లిస్ట్ ప్రకటించారు నిర్వహకులు. అయితే అసలు విషయం ఏంటంటే ఐపీఎల్ 14వ సీజన్ కోసం బీసీసీఐ ప్రకటించిన వేదికల్లో హైదరాబాద్ నగరం లేకపోవడం గమనార్హం అని చెప్పుకోవాలి. ఈ విషయంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు కేటీఆర్ నిర్వాహకులకు ఆసక్తికర ట్వీట్ చేశారు.
బీసీసీఐ కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వేదికలను ఎంపిక చేసింది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్…. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం మ్యాచ్ లు నిర్వహించే వేదికల జాబితాలో హైదరాబాద్‌ను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలిని బహిరంగంగా కోరుతున్నానని తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న సమర్థవంతమైన చర్యల కారణంగా హైదరాబాద్‌లో అత్యంత తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని వివరించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.