కేంద్రం సామాన్యుడి నడ్డివిరుస్తోంది- మంత్రి హరీష్‌

52
harish

ఆదివారం చేవెళ్లలో టీఆర్‌ఎస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్‌ రావు పాల్గొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు ఈ సమావేశానికి హాజరైయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో వాస్తవాలను ప్రచారం చేయాలని, బీజేపీ నేతల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పార్టీశ్రేణులకు మంత్రి హరీష్‌ రావు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు కల్పిస్తుంటే బీజేపీ ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు తొలగిస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ కేంద్రం కార్పొరేట్లకు దోచిపెడుతోందని మండిపడ్డారు. డీజిల్‌, పెట్రోల్‌, నిత్యావసర ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరుస్తోందని అన్నారు. కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో బీజేపీ చెప్పాలని మంత్రి హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు.