- Advertisement -
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన హత్యపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ హత్యపై స్పందించారు మంత్రి కేటీఆర్. ఈ హత్య వెనుక ఉన్న కారణం తనను తీవ్ర భయాందోళనకు, షాక్‌కు గురి చేసిందన్నారు. ఇలాంటి అనాగరిక హింసకు సమాజంలో చోటు లేదని…ఇలాంటి ఘాతుకాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలన్నారు.
ఉదయ్‌పూర్‌లో ఇద్దరు వ్యక్తులు పట్టపగలే ఓ టైలర్‌ను దారుణంగా హత్య చేశారు. కత్తితో తల నరికి మొండెం నుంచి వేరుచేశారు. వివాదాస్పద మతపరమైన పోస్టు ఈ హత్యకు కారణం కాగా రాష్ట్రవ్యాప్తంగా నెల పాటు నిషేధాజ్ఞలు విధించారు.
- Advertisement -