KTR:ఘనంగా మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం

17
- Advertisement -

15న జరిగే మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు మంత్రి కేటీఆర్. 15వ తేదీన ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీ ల ప్రారంభం ఉండనుందన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లో మట్లాడారు. 15వ తేదీన జరిగే మెడికల్ కాలేజీ ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. 20,000 మందికి తగ్గకుండా ర్యాలీ నిర్వహించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు.

దేశంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ జమానాలో తెలంగాణకు దక్కింది కేవలం రెండు మెడికల్ కాలేజీలే అన్నారు. 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది శూన్యం అన్నారు. తెలంగాణ ఆహార ఉత్పత్తిలోనే కాదు దేశ ఆరోగ్యానికి కీలకమైన డాక్టర్ల ఉత్పత్తిలోనూ అగ్ర స్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఈ దశ ఈనెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ఏకకాలంలో ప్రారంభం చేసి చరిత్ర సృష్టించనుందన్నారు.

జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనుందని…రాష్ట్రంలోని జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, అసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో నూతన మెడికల్ కాలేజీలను ఈనెల 15వ తేదీన ప్రారంభించుకోబోతున్నాం అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రారంభించుకుంటున్న 9 జిల్లా కేంద్రాల్లో కనీసం 15 నుంచి 20 వేల మందికి తగ్గకుండా భారీ ర్యాలీలను చేపట్టాలని సూచించారు. స్వయంగా ముఖ్యమంత్రి ఒక మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా ఆ జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలకు, జిల్లా ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఆయా జిల్లాల పరిధిలో ఉన్న శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు 15వ తేదీన జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. మెడికల్ కాలేజీ ప్రారంభం వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లో రిజిస్టర్ అయ్యేవిధంగా ఈ కార్యక్రమంలో భారీగా పెద్ద ఎత్తున యువతను, విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు.మెడికల్ కాలేజీ ఏర్పాటు వలన కేవలం విద్యార్థులకే ప్రయోజనం కాకుండా దానికి అనుబంధంగా ఉండే హాస్పిటల్ వలన ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయన్నారు.

Also Read:నిద్రపోయే ముందు ఈ తప్పులు చేస్తున్నారా..జాగ్రత్త!

- Advertisement -