Harishrao:మెడికల్ సీట్లలో అగ్రస్థానంలో తెలంగాణ

7
- Advertisement -

భారతదేశంలో అతి ఎక్కువ ఎంబిబిఎస్ సీట్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందన్నారు మంత్రి హరీష్ రావు. ప్రతి లక్ష జనాభా కి 22 ఎంబిబిఎస్ సీట్లతో తెలంగాణ ఆగ్రస్థానంలో ఉంది. 2014లో ఈ విషయంలో చిట్ట చివరి స్థానంలో ఉన్న తెలంగాణ, నేడు అగ్రస్థానానికి చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే కనీసం ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని విమర్శించారు.

50 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ ఉద్యమ ఒత్తిడి వలన నిజామాబాద్, ఆదిలాబాద్ లో మాత్రమే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణ విద్యార్థులు వైద్య విద్య కోసం పక్క రాష్ట్రాల నుంచి మొదలుకొని ఉక్రెయిన్ , రష్యా వంటి విదేశాలకు వెళ్లి అనేక కష్టాలు పడి చదువుకునేవారన్నారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి, తెలంగాణ పిల్లలు తెలంగాణ రాష్ట్రంలోని ఎలాంటి కష్టం లేకుండా వైద్య విద్యను అభ్యసించే గొప్ప సౌకర్యాన్ని కల్పించారన్నారు.

కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు వలన అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య సౌకర్యాలను ప్రజలకి వివరించాలని హరీష్ రావు సూచించారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబిబిఎస్ సీట్లలో 43% తెలంగాణ రాష్ట్రంలోనే పెరిగాయన్నారు.

Also Read:నిద్రపోయే ముందు ఈ తప్పులు చేస్తున్నారా..జాగ్రత్త!

- Advertisement -