కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాధి భారీన పడి మూడు వేలకు పైగా మృతిచెందగా 90 వేల మంది ఈ మహమ్మారి భారీ పడ్డారు. ఈ నేపథ్యంలో కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు.
తాజాగా తెలంగాణలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా బెంగళూరులో ఆర్టీసీ బస్సులను అధికారులు ప్రత్యేకంగా శుభ్రంచేస్తున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్ మెట్రోరైలులో చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారు. అదేవిధంగా ఆర్టీసీకి తగు సూచనలు చేయాలంటూ రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను మంత్రి ట్విట్టర్ ద్వారా కోరారు.
Request MDs of @hmrgov @ltmhyd to start the same in HYD Metro Rail immediately
Also Request Transport Minister @puvvada_ajay Garu to direct TSRTC to do the same asap https://t.co/wYA9AfIBGj
— KTR (@KTRTRS) March 4, 2020