ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందుతుంది- కేటీఆర్‌

117
ktr

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు ప్రభావితమైన వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పదివేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారుల సహాయంతో వరద ప్రభావిత కుటుంబాలను గుర్తించి, వారందరికీ  ఆర్థిక సహాయం అందించామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఈ రోజు పలు ప్రాంతాల నుంచి తమకు ఇంకా ఆర్థిక సహాయం అందలేదని కొంతమంది చేస్తున్న విజ్ఞప్తిలు తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి  సహాయం అందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నం అన్నారు. పదివేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి విశాల దృక్పథంతో వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించాల ని  తమకు ఆదేశాలు ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

ఇప్పటికీ ఇంకా ఎవరికైనా అర్హులైన వరద బాధితులకు ఆర్థిక సహాయం అందకుంటే, మరి కొద్ది రోజుల పాటు వారందరికీ ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం కొనసాగుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. వరదల్లో నష్టపోయిన ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. ఈ మేరకు జిహెచ్ఎంసి అధికారులతో, హైదరాబాద్ జిల్లా యంత్రాంగం తో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం పైన సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.