గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న జగిత్యాల ఎస్పీ సింధు శర్మ..

136
Jagtial sp sindhu sharma

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్ ఈ రోజు క్యాంపు కార్యాలయంలో మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఆదర్శనీయం,ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందివ్వాలని అని అన్నారు.

హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలోని పోలీసు కార్యాలయాలలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీ శశాంక ఐఏఎస్‌ కి, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి ఐఏఎస్‌,రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్‌లకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు.