ముల్కలపల్లిలో స్థానికులతో ముచ్చటించిన సీఎం కేసీఆర్..

91
kcr

శనివారం సీఎం కేసీఆర్‌ జనగాం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో సీఎం తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో ఆగి స్థానికులతో ముచ్చటించారు. కారులో నుంచే నిమిషం పాటు కలెక్టర్‌తో, స్థానికులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతు బంధు, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. గుంతలమయం అయిన తుర్కపల్లి-భువనగిరి రోడ్డు గురించి సీఎం కేసీఆర్‌ను స్థానికులు అడిగారు. ఈ మేరకు రోడ్డు మరమ్మత్తుల పనులు ప్రారంభమవుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు.