- Advertisement -
త్వరలో వీఆర్ఏల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు మంత్రి కేటీఆర్. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో వీఆర్ఏలు ఆందోళన చేస్తుండగా ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో కలిసి వీరితో భేటీ అయ్యారు కేటీఆర్.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వీఆర్ఏలకు ఇచ్చిన హామీల అమలుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వం, వీఆర్ఏలు వేర్వేరు కాదని …ఆందోళనలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్కు వీఆర్ఏ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -