దావోస్‌లో కేటీఆర్, సద్గురు భేటీ..

133
ktr
- Advertisement -

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ బిజిబిజిగా ఉన్నారు. ఇక దావోస్ వేదికపై సద్గురు జగ్గీ వాసుదేశ్, కేటీఆర్ భేటీ అయ్యారు. ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. యోగా గురురు సద్గురు జగ్గీ వాసుదేవ్ కొంత కాలంగా Save Soil పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దావోస్ వేదికపై ప్రపంచ స్థాయి కంపెనీల ప్రతినిధులను కలిసి తన ఆలోచనలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సద్గురు…సారవంతమైన నేలలు అంతరించిపోయే ప్రమాదం ఉందని సద్గురు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, కార్పొరెట్ కంపెనీలు, ప్రజలంతా కలిసి భవిష్యత్ తరాలకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగేలా ఇప్పటి నుంచి వ్యవసాయ నేలలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ చేపట్టిన పలు పర్యావరణ అనుకూల కార్యక్రమాల గురించి సద్గురుకు కేటీఆర్ వివరించారు. ఏడేళ్లుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని …మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించామని.. తద్వారా భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం …వ్యవసాయోత్పత్తుల పెంపునకు చేస్తున్న కృషిని సద్గురుకు వివరించారు. సద్గురు చేపట్టిన సేవ్ సాయిల్ ర్యాలీ అద్భుతమైన కార్యక్రమమని ప్రశంసించారు.

- Advertisement -