భగ్గుమన్న కోనసీమ…ఆందోళన కారులపై కఠిన చర్యలు!

122
konaseema
- Advertisement -

కోనసీమ మరో కేరళ. ప్రకృతి అందాలకు నెలవు. కానీ అలాంటి కొనసీమ భగ్గుమంది. ఈ జిల్లాకు అంబేద్కర్ కొనసీమ అని పేరు మార్చడంపై జేఏసీ, నిరసన కారులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు నిరసనకారులు నిప్పు పెట్టారు. మూడు బస్సులను తగలబెట్టారు. పోలీసు వాహనాలపై రాళ్ల దాడి చేశారు.

ఉదయం నుంచి ప్రశాంతంగా ఆందోళన చేపట్టిన నిరసనకారులు ఒక్కసారిగా మధ్యాహ్నం తర్వాత తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. పలువురు పోలీసులు గాయపడ్డారు.

అంబేద్కర్ పేరు జిల్లాకు పెడితే వ్యతిరేకించడం బాధాకరం అన్నారు హోంమంత్రి. జిల్లా ప్రజల విజ్ఞప్తుల మేరకే జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చామని …విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. సీసీఫుటేజ్‌ ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని… అమలాపురం పూర్తిగా పోలీసుల ఆధీనంలోనే ఉందని చెప్పారు ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు . పుకార్లను ఎవరూ నమ్మవద్దని.. హింసాత్మక సంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -