టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం..

30

పార్టీ సంస్థాగత కార్యకలాపాల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సంసిద్ధం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో పార్టీ శ్రేణులతో నిర్వహిస్తున్న సమావేశాలు ఈ రోజు కూడా తెలంగాణ భవన్‌లో కొనసాగాయి. ఈరోజు జరిగిన సమావేశాల్లో పూర్వ వరంగల్, అదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల సమావేశాలు కొనసాగాయి. 

ఈ సమావేశాలకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ మరియు పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ పార్టీ ద్వి శతాబ్ది ఉత్సవాల ప్లీనరీ మరియు నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయ గర్జన సభకు సంబంధించిన కార్యాచరణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ భవన్‌లో ఈ సమావేశాలకు ముందు తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రి స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మరియు ఇతర సీనియర్ నాయకులు ఘన నివాళులు అర్పించారు.