నాయినికి నివాళులు అర్పించిన మంత్రి అల్లోల..

26

దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నివాళుల‌ర్పించారు. నాయిని చిత్రపటానికి ఆయ‌న‌ పుష్పాంజ‌లి ఘ‌టించారు.హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని పింగళి వెంకట్ రాంరెడ్డి ఫంక్షన్ హాల్‌లో నాయిని సంస్మరణ సభకు శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం పేద ప్రజల అభ్యున్నతికి పరితపించిన మహానేత నాయిని నర్సింహా రెడ్డి అని కార్మికుల సమస్యలు, హక్కుల కోసం నాయిని ఎనలేని కృషి చేశారని మంత్రి పేర్కొన్నారు.