పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన..

101
- Advertisement -

మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా దేవరకద్ర మండలంలోని వెంకపల్లిలో రూ.55 కోట్లతో చేపట్టిన పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. దేవరకద్ర, కొడంగల్‌ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్‌ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌ (సిద్దాయపల్లి) వద్ద నిర్మించిన 288 డబుల్‌ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందచేయనున్నారు.

భూత్పూర్‌లో మినీ స్టేడియం నిర్మాణానికి, సమీకృత వెజ్‌-నాన్‌ వెజ్‌ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. భూత్పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
కోస్గి పట్టణంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. పంచతంత్ర పార్క్‌ ఏర్పాటుకు శంకుస్థాపన , కోస్గి బస్‌ డిపోను ప్రారంభిస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

- Advertisement -