గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ..

201
mp nd gupta

దేశ రాజధాని ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతున్నది. ఈ రోజు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ హరిత సవాల్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ దాస్ గుప్తా స్వీకరించారు. ఈ మేరకు ఢిల్లీలోని తన నివాసంలో మొక్కలు నాటారు.

అనంతరం ఎంపీ ఎన్ డీ గుప్తా మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలని ఎన్ డీ గుప్తా కోరారు.