గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మురుగునీటిని శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను (ఎస్టీపీ) నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కూకట్ పల్లి ఫతేనగర్ వద్ద 100 ఎంఎల్‌డీల సామర్ధ్యంతో నిర్మించే ఎస్టీపీ పనులకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబీపూర్ రాజు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండి దాన కిషోర్ పాల్గొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మూడు దశల్లో 62 ప్రాంతాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించాలన్న లక్ష్యంతో ప్యాకేజీ-3 కింద తొలి విడతగా రూ.1280 కోట్లతో 376.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలోని 17 ప్రాంతాల్లో కొత్తగా ఎస్టీపీలు నిర్మిస్తున్నారు.