పవర్‌ స్టార్‌ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌..!

62
Pawan Kalyan

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్‌ ఇండియా మూవీగా ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. మొగల్ రాజుల కాలం .. కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ బందిపోటు దొంగగా కనిపించనున్నారు. ఆయన లుక్ కి ఆల్రెడీ విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇప్పటికే ‘హరిహరి వీరమల్లు’కు సంబంధించి విడుదలైన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగానే పెంచాయి.

అయితే తాజాగా సినిమాకి సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. సెప్టెంబర్‌ 2వ తేదీన పవన్ బర్త్ డే కావడంతో, ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో వదలనున్నట్లు సమాచారం. అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్‌ ఫస్ట్ లుక్‌ ను ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 17న విడుదల చేస్తారని తెలుస్తోంది. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పవన్‌ ఈమూవీతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.