జూరాల వద్ద భారీ పార్కు నిర్మాణానికి భూమిపూజ చేసిన కేటీఆర్‌..

21
ktr minister

రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం జోగుళాంబ గద్వాల జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూరాల ప్రాజెక్టు వద్ద రూ.15 కోట్లతో నిర్మించే పార్కుకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అంతకుముందు గద్వాల జిల్లాలో ఆలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మించే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ తో పాటు రాష్ట్ర మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, శ్రీ గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.