థ్యాంక్స్ సామ్.. చైతూ ట్వీట్..

95
Naga Chaitanya

టాలీవుడ్‌ జంట స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. కాగా, వీరి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని జ‌రుగుతోన్న‌ ప్రచారంపై అటు స‌మంత, ఇటు చైతూ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. దీంతో వీరి విడాకుల వ్యవహారం నిజమే అయి ఉంటుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

అయితే నాగ‌చైత‌న్య, సాయి ప‌ల్ల‌వి న‌టించిన ల‌వ్ స్టోరీ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన నేప‌థ్యంలో ఈ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ స‌మంత ట్వీట్ చేసింది. అలా చైతూతో త‌న‌కు విభేదాలు ఏమీ లేవ‌న్న సంకేతాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది సామ్‌. ఇప్పుడు నాగ‌చైత‌న్య కూడా అదే ప్ర‌య‌త్నం చేస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. త‌మ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ స‌మంత చేసిన ట్వీట్‌ను చైతూ రీట్వీట్ చేస్తూ థ్యాంక్యూ సామ్ అని పేర్కొన్నాడు.