ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన..

292
ktr

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్‌ ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. మధ్యా హ్నం 12.30 గంటల వరకు ఖమ్మంలో జరిగే పట్టణప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నగరంలో పలు అభివృద్ది కార్యక్రమల్లో మంత్రి పాల్గొంటారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహిస్తారు.

అనంతరం రఘునాథపాలెం వైఎస్సార్‌నగర్‌ కాలనీలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్ల సముదాయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో జరిగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు మంత్రి హాజరుకానున్నారు. అనంతరం ఇల్లెందు వెళ్లి అక్కడ పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొన నున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు తిరిగి హైదరాబాద్‌ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేటీఆర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు పాల్గొనున్నారు.