మహేష్‌కు బాలీవుడ్ నుండి భారీ ఆఫర్..!

350
mahesh

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై గత కొంతకాలంగా పలురకాల వార్తలు వస్తున్నాయి. కానీ.. అవేవి వాస్తవ రూపం దాల్చలేదు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు ప్రిన్స్ మహేష్‌. అయితే ఇప్పుడు మరోసారి అతని హిందీ చిత్ర రంగ ప్రవేశంపై వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా నుంచి మహేష్‌కు భారీ ఆఫర్ వచ్చినట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల ఓ కంపెనీ యాడ్ కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో కలిసి మహేష్‌ బాబు నటించారు. గడచిన రెండేళ్లలో రణవీర్, మహేష్‌ కలిసి యాక్ట్ చేయడం ఇది మూడోసారి.

ఈ యాడ్ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా, అక్కడికి వచ్చిన సాజిద్, రణవీర్, మహేష్‌లతో భారీ మల్టీ స్టారర్‌ను ప్లాన్ చేస్తున్నానని చెబుతూ, నటించాలని కోరారట. బాలీవుడ్‌లో రణవీర్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అటువంటి హీరోకు మహేష్‌ బాబు కలిస్తే, పాన్ ఇండియా మూవీ అవుతుందన్న ఆలోచనలో ఉన్న సాజిద్, ఇందుకోసం భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశాడని తెలుస్తోంది. గతంలో పలుమార్లు తాను హిందీ సినిమాలు చేయబోనని మహేష్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజా ఆఫర్ పై మహేష్‌ నుంచి క్లారిటీ రావాల్సి వుంది.