తేజ డైరెక్షన్‌లో కీర్తి సురేశ్..!

284
Keerthi Suresh

డైరెక్టర్‌ తేజ నేనే రాజు నేనే మంత్రి తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రయత్నం విఫలమైంది. అటుపైనా ఓ సినిమా చేస్తే ఐపు లేదు. ఇటీవల తేజ ఓ రెండు చిత్రాల్ని ప్రకటించారు. ఆ రెండిటి టైటిల్స్ వెల్లడించినా వాటిలో హీరోల పేర్లు లీక్ చేయలేదు. రాక్షస రాజు రావణాసురుడు.. అలిమేలు మంగ వెంకట రమణ అనే టైటిల్స్ తో సినిమాల్ని ప్రకటించాడు.

ఇక ‘అలమేలు మంగ – వెంకటరమణ’లో కథానాయకుడిగా గోపీచంద్ చేయనున్నాడు. ఈ సినిమాలో నాయిక పాత్రకి కాజల్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా కీర్తి సురేశ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే కాజల్ తో పాటు కీర్తి సురేశ్ ను తీసుకున్నారా? లేదంటే కాజల్ కి బదులుగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. ఒకవేళ కాజల్ ఈ సినిమాలో లేకపోతే, రానాతో చేయనున్న ప్రాజెక్టులోకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.