రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నదని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాల్లో కేంద్రం కోటా తగ్గించిందని, అయినప్పటికీ అంగన్వాడీ, ఆశా కార్యకర్తల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందన్నారు.
పేదింటి ఆడబిడ్డ పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావద్దని కల్యాణలక్ష్మి తీసుకొచ్చామని తెలిపారు. కంటి వెలుగు ద్వారా బాధితులకు వైద్యం అందించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరి ప్రభుత్వ దవాఖానల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచామన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని వెల్లడించారు.
అమ్మ ఒడి లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని…. ఇప్పటివరకు 13.30 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందజేశామన్నారు. మగపిల్లలు పుడితే రూ.12 వేలు, ఆడ పిల్లలు పుడితే రూ.13 వేలు ఇస్తున్నామని తెలిపారు. నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మరో 10 లక్షల మంది కొత్తవాళ్లకు పెన్షన్లు ఇవ్వనున్నామని తెలిపారు.