హైటెక్స్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ..పరిశీలించిన కేటీఆర్

21
ktr

ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశ హైటెక్స్ ప్రాంగణాన్ని పరిశీలించారు మంత్రి కేటీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్..అనేక సవాళ్లను ఎదుర్కొని… అద్భుతమైన ఉద్యమాన్ని నడిపి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల ఈ మేరకు తెలంగాణ సాధించుకున్నామన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నము…తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం అన్నారు. మా పార్టీ విధానాలను పరిపాలనను మెచ్చి ప్రజలు మరోసారి ఆశీర్వదించారు….

ప్రభుత్వం లోకి వచ్చిననాటి నుంచి అపూర్వమైన విధానాలతో… పాలసీలతో దేశానికి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు దేశ ప్రజలు… భారత ప్రభుత్వానికి సైతం ఆదర్శంగా నిలుస్తుంది.. మా సర్కార్ మా పథకాలను కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని… వాటిని అనుకరించి… రైతుబంధు లాంటి కార్యక్రమాల స్ఫూర్తితో పీఎం కిసాన్ ను  కేంద్రం ప్రారంభించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ఇంటింటికి నల్లా నీళ్లిచ్చిన మిషన్ భగీరథ కార్యక్రమం మాదిరే కేంద్రం jal jeevan mission ప్రారంభించిందన్నారు. టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల విధానాన్ని కూడా కేంద్రం త్వరలో తీసుకురాబోతుందన్నారు. ఒకప్పుడు బెంగాల్ చేసే పనిని రేపు భారత్ చేస్తుంది అనే నినాదం ఉండేది… అది ఈరోజు తెలంగాణ ఏం చేస్తుందో రేపు భారత్ అదే చేస్తుంది అన్నట్లుగా మారిందన్నారు.

ఇంత గొప్పగా తెలంగాణ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది…25 తేదీన జరిగే పార్టీ సాధారణ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు. ఈ సమావేశం హైటెక్స్ లో జరుగుతుంది.ఈ కార్యక్రమానికి వచ్చే పార్టీ ప్రతినిధులతో పాటు… మొత్తం సమావేశం సజావుగా సాగేలా అనేక ఏర్పాట్లను చేస్తున్నాం అన్నారు. సభ నిర్వహణ మరియు దానికి సంబంధించిన ఏర్పాట్లను కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరఫున పలు కమిటీలను ప్రకటించారు కేటీఆర్.

ఈ సమావేశానికి వచ్చే ప్రతినిధులకు పార్టీ తరఫున గుర్తింపు కార్డులను అందిస్తాం అన్నారు. పార్టీ ఆహ్వానించిన వారు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందన్నారు.