రివ్యూ: మహాసముద్రం

69
maha samudram

ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం మహాసముద్రం. సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కాగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా అందరిని మెప్పించిందా లేదా చూద్దాం..

కథ:

సినిమా ఒక అందమైన లవ్‌స్టోరీ. సంబంధంలేని ఇద్దరు వ్యక్తుల జీవితంలో ఓ అమ్మాయి ప్రవేశించడం, ఆ తర్వాత అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వీళ్లిద్దరికి గూడు బాబ్జీ(రావు రమేశ్)తో గొడవలు ప్రారంభం అవుతాయి. తమ ప్రేమ కోసం ఇద్దరూ ఒక్కటవుతారా? ఆ ఇద్దరూ కలిసి గూడు బాబ్జీని ఎలా ఎదుర్కొంటారు? ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? అన్నదే మహాసముద్రం కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, నటీనటులు, ముఖ్యంగా శర్వానంద్ ,సిద్ధార్థ్ అద్భుత నటన కనబర్చారు. ఒకరిని మంచి మరొకరు పోటీ పడి నటించారు. అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు నటన సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లింది. ఇక గూడు బాబ్జిగా రావు రమేష్ అద్భుత నటన కనబర్చారు. మిగితా నటీనటుల్లో జగపతి బాబు తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ నేరేషన్. కథ బాగున్న నేరేషన్ తగ్గిస్తే బాగుండేది. కామెడీ లేక పోవడం కూడా సినిమాకు మరో మైనస్ పాయింట్ .

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. అజయ్ భూపతి తాను ఎంచుకున్న పాయింట్‌ను చక్కగా ప్రజెంట్ చేయగలిగారు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

మరోసారి ఓ అందమైన లవ్‌స్టోరీతో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు అజయ్ భూపతి. మొత్తంగా ఈ దసరాకు ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రం మహాసముద్రం.

విడుదల తేదీ:14/10/2021
రేటింగ్:2.75/5
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్‌,అను ఇమ్మాన్యుయేల్, అదితిరావు
సంగీతం: చైతన్య భరద్వాజ్
నిర్మాత:సుంకర రామబ్రహ్మం
దర్శకత్వం: అజయ్ భూపతి