త్వరలో చిరంజీవిని కలుస్తా: విష్ణు

29
vishnu manchu

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారి నందమూరి బాలకృష్ణను కలిశారు విష్ణు. గురువారం ఉదయం మోహన్ బాబుతో కలిసి బాలకృష్ణ ఇంటికి వెళ్లిన విష్ణు….పలు అంశాలపై చర్చించారు.

బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన్ని కలవడం ఆనందంగా ఉందన్నారు మోహన్ బాబు. గత సాధారణ ఎన్నికల సమయంలో మంగళగిరిలో బాలయ్య అల్లుడు లోకేశ్‌ ఓటమికి ప్రచారం చేశా. కానీ, ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా ‘మా’ ఎన్నికల్లో విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారని కొనియాడారు.

త్వరలోనే మెగాస్టార్‌ చిరంజీవిని కలవనున్నట్లు చెప్పారు మంచు విష్ణు. ఇప్పటికే కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, పరుచూరి సోదరులను కలిశాను. త్వరలోనే చిరంజీవిని కలుస్తాను. సినీ పెద్దలందరిని కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపారు విష్ణు.