గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించిన కేటీఆర్..

228
- Advertisement -

భారతదేశంలో తమ ఇంజనీరింగ్, బిజినెస్ ఇన్నోవేషన్ గ్లోబల్ సెంటర్‌ను విస్తరించే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ నగరంలో స్థాపించిన గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంజన్ సంతాని, హెడ్ ఆఫ్ గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ సర్వీసెస్ ఇన్ ఇండియా, సోంజోయ్ చటర్జీ, సీఈఓ గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ ఇండియా, ఐటీ & పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ‌త కొన్నేండ్ల నుంచి ప‌లు మ‌ల్టీనేష‌న‌ల్ బ్యాంకుల‌ను ఆక‌ర్షించింద‌న్నారు. ఈ ఏడాదికి సంబంధించి అతి పెద్ద కంపెనీల పెట్టుబ‌డుల జాబితాలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కంపెనీ చేర‌డం సంతోషంగా ఉంద‌న్నారు. బ్యాంకింగ్, ఆర్థిక‌, బీమా రంగాల్లో హైద‌రాబాద్ న‌గ‌రం వేగంగా వృద్ధి చెందుతోంద‌న్నారు. గ‌డిచిన కొన్నేళ్ల‌లో ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి. ఈ రంగాల్లో ల‌క్ష 80 వేల మంది కేవ‌లం హైద‌రాబాద్‌లో ఉపాధి పొందుతున్నారు. ఈ రంగాల్లో భాగ్య‌న‌గరానికి ఉన్న అనుకూల‌త‌లే ఇందుకు ఉదాహ‌ర‌ణ అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఐఎస్‌బీ, ఐఐఎం బెంగ‌ళూరు స‌హాకారంతో దేశ వ్యాప్తంగా ప‌ది వేల మంది మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌ను రూపొందించాల‌న్న గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ ల‌క్ష్యాన్ని అభినందిస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం హైద‌రాబాద్‌లోని వీ-హ‌బ్‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని కోరుతున్నాను. ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, బ్లాక్ చైన్ సాంకేతిక‌త‌ల్లో రాష్ర్ట ప్ర‌భుత్వం భారీగా పెట్టుబ‌డులు పెడుతోంది. ఆర్థిక రంగంలో మ‌రిన్ని ఆవిష్క‌ర‌ణల రూప‌క‌ల్ప‌న‌కు టీ-హ‌బ్ దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -