సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి: ఎల్ రమణ

31
ramana

సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అన్నారు టీఆర్ఎస్ నేత ఎల్ రమణ. దేశంలోనే మొదటి సారిగా దళిత బంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందన్నారు.

ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలన్న సీఎంకేసీఆర్ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం చరిత్రలో గొప్ప మైలు రాయిగా నిలిచి పోతుందన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన నేతగా కేసీఆర్‌ తరతరాలకు గుర్తుంటారని పేర్కొన్నారు. హుజురాబాద్ నుంచి ప్రారంభించిన రైతు బంధు పథకం విజయవంతం అయినట్టే దళిత బంధు కూడా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.