డబుల్ బెడ్ రూమ్‌ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

129
ktr

గోషామహల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. రూ. 14.88 కోట్ల ఖర్చుతో నిర్మించిన 192 బెడ్ రూమ్‌లను ప్రారంభించారు.దీంతో పాటు స్ధానికంగా ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు.ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇల్లు అందుకుంటున్న అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో చాలా మార్పులొచ్చాయ్. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడం సీఎం కేసీఆర్ కళ. గత ప్రభుత్వల లాగా అగ్గిపెట్టెల లాగా కట్ట లేదు. బందోబస్తు గా కట్టి చూపించినం అని మంత్రి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దళారుల ఎవ్వరికి డబ్బులు ఇవ్వొద్దు. ఇందులో రాజకీయాలు చేయకూడదు అన్ని లాటరీ సిస్టంలో ఇండ్లు ఇస్తాం. తెలంగాణలో 18 లక్షల ఇల్లు కట్టిస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తుంది. అన్ని సౌకర్యాలతో కూడిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తున్నాం కాబట్టి ఎవ్వరు వీటిని అమ్ముకోకండి అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.