తొందరలోనే అందరికి ఇండ్లు అందుతాయి- మంత్రి కేటీఆర్

154
ktr
- Advertisement -

హైదరాబాద్ కట్టెలమండిలో డబుల్ బెడ్ రూమ్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, మండలి చీఫ్ విప్ బోడకుంటి, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పండుగ నిన్న అయినా ఇళ్ల లబ్ధిదారులు ఇవాళ పండుగ జరుపుకుంటున్నంత సంతోషంగా ఉన్నారు. ఇల్లు కట్టడం.. పెళ్లి చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పనులు. పేదలకు సొంతిళ్లు అనేది చిరకాల స్వప్నం. సీఎం కేసీఆర్ పేదలకు ఇల్లు కట్టిస్తున్నాడు.. పెళ్లి కూడా చేయిస్తున్నాడు. సీఎం కేసీఆర్ సొంత మేనమామలా షాదిముబారక్, కల్యాణ లక్ష్మీ అందిస్తున్నారని కేటీఆర్‌ కొనియాడారు. స్లమ్ ఫ్రీ సిటీ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో 2.75 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నాం అని అన్నారు.

హైదరాబాద్ లోనే లక్ష ఇండ్లు కట్టిస్తున్నాం.. తొందరలోనే అందరికి అందుతాయి. ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు బాగుపడ్డాయి.ఆరేళ్ళ నుంచి చిన్న గోడవైన జరిగిందా.. కర్ఫులు, గొడవలు లేని.. సామరస్య వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. 65-70 ఏళ్ల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఇళ్లను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. లబ్ధిదారులు ఇళ్లను అమ్ముకోవద్దు. దవాఖాన కూడా ఇక్కడే ఏర్పాటు చేసాం. అంగన్ వాడి కేంద్రం, లైబ్రరీ, జిమ్ లాంటి వసతులు కల్పిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

- Advertisement -