- Advertisement -
హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఒవైసి జంక్షన్ లో నిర్మించిన భారీ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్.ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్, స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ,మహమూద్ అలీ,ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు హాజరయ్యారు.
80 కోట్లతో 1.36 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మించింది జిహెచ్ఎంసి. మొదటి దశలో 8092 కోట్లతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, కేబుల్ బ్రిడ్జిలకు శ్రీకారం చుట్టింది జీహెచ్‌ఎంసీ. 23 చోట్ల అందుబాటులోకి ఫ్లైఓవర్లు అండర్ పాస్‌లు అందుబాటులోకి రాగా 24 చోట్ల పనులు వివిధ దశలలో ఉన్నాయి. మరి కొద్ది రోజులలో షేక్‌పేట్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ కూడా ప్రారంభం కానుంది.
- Advertisement -