నల్లగొండలో కొత్త ఎస్సీ ఎస్టీ హాస్టల్‌ను ప్రారంభించిన మంత్రులు..

21

ఈరోజు మంత్రి కేటీఆర్‌ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈపర్యటనలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతన ఎస్సి, ఎస్టీ బాలుర ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్ భవనాన్ని మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిలతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.