మ‌రోసారి మంచి మ‌న‌సు చాటుకున్న మంత్రి కేటీఆర్..

24

మంత్రి కేటీఆర్ మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నారు. వింత‌ జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న ఓ చిన్నారి ప్రాణానికి మంత్రి కేటీఆర్ అండ‌గా నిలిచారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగీతం గ్రామానికి చెందిన ఓ చిన్నారి వింత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నది. వారి త‌ల్లిదండ్రులు వ్యాధి నయం చేయించేందుకు పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఈ జ‌బ్బును న‌యం చేసేందుకు పెద్ద మొత్తంలో డ‌బ్బు అవ‌స‌రం ప‌డుతుంద‌ని వైద్యులు చెప్పారు. కానీ ఆ చిన్నారి త‌ల్లిదండ్రుల వ‌ద్ద అంత డ‌బ్బు లేక దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయారు. ఈ విషయాన్ని ఓ యువకుడు ట్విట్ట‌ర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చాడు.

మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి ఆ పాపకు ఆపరేషన్ చేయిస్తానని.. వ్యాధి పూర్తిగా తగ్గే వరకు పూర్తి సహకారం అందిస్తాన‌ని భ‌రోసానిచ్చారు. పాప అనారోగ్య స‌మ‌స్య‌ను త‌న దృష్టికి తీసుకొచ్చినందుకు ధ‌న్య‌వాదాలు అని తెలిపారు మంత్రి కేటీఆర్. చెప్పిన విధంగానే వైద్యులు గురువారం పాపను పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు. కాగా, మంత్రి కేటీర్‌ గతంలో కూడా ఎంతో మంది బాధితులకు అండగా నిలిచి ఆప‌ద‌లో ఆదుకునే ఆప‌ద్భాంధ‌వుడిగా మారారు.