కష్టకాలంలో అండగా గ్రీన్‌ కో..అభినందించిన రామ్

60
ktr minister

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండగా మరోవైపు ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు స్వచ్చంధ సంస్థలు,ప్రముఖులు తమవంతు సాయం అందిస్తుండగా తాజాగా గ్రీన్ కో సంస్థ ముందుకొచ్చింది. చైనా నుంచి 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, పెద్ద సంఖ్యలో సిలిండర్లను తెప్పించి తెలంగాణ ప్రభుత్వానికి అందించింది.

ఆక్సిజన్ సిలిండర్స్ అందించడానికి గ్రీన్ కో సంస్థ ముందుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు హీరో రామ్ చరణ్. గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన రామ్ చరణ్‌… తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తోందని కొనియాడారు.