20న కేరళ సీఎం ప్రమాణస్వీకారం..

41
vijayan

కేరళ సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు పినరయి విజయన్‌. ఈ నెల 20న తిరువనంతపురంలోని సెంట్రల్​ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుండగా..కరోనా నేపథ్యంలో కేవలం 500 మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

విజయన్‌తో ఆ రాష్ట్ర గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ఖాన్​ విజయన్​తో ప్రమాణం చేయించనుండగా 21 మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేరళ చరిత్రలోనే రికార్డును తిరగరాస్తూ విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకుంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో వామపక్ష కూటమి 99 సీట్లను గెలుచుకోగా కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్‌ 41 స్థానాలకే పరిమితమైంది.