రాష్ట్రపతికి రామన్న బర్త్‌ డే విషెస్‌..

435
ktr minister
- Advertisement -

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు తన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ట్వీటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తదితరులు రామ్ నాథ్ కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

అలాగే తెలంగాణ ఐటీ మంత్రి,టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ఆయన తండ్రి సీఎం కేసీఆర్‌తో పాటు కోవింద్ కలిసి ఉన్న ఫోటోను కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రజాసేవలో ఉంటూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కేటీఆర్ అభిలషించారు.

- Advertisement -